100+ శతకములు

బద్దెన - సుమతీ శతకము

1
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ !
భావము:- తన శతక స్వభావాన్ని పూరించే విధంగా మొట్ట మొదటి పద్యంలోనే చెప్పాడు. తను చెప్పటం లేదట. శ్రీరాముని దయ చెప్పిస్తోందట. ఏ విధంగా అంటే అఖిల లోకము, ఎల్ల జనులు మెచ్చుకొని విధంగా ఔరాయనగ ఎన్నో నీతులు నోటిలో నించి ధారా పాతంగా వస్తాయట. నోటిలో నీరు ఏవిధంగా వూరుతుందో తన కాలంలోంచి (గంటలొచ్చి) ఆ విధంగా నీతులు వస్తాయట. చదివే వాడు (వినే ) బుద్దిమాంగుడైతేనే ఇవి రుచిస్తాయట అందుకనే "సుమతీ" అనే మకుటం ఎన్నుకొన్నాడు.
2
అక్కరకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ !
భావము:- ఏవేవి వెంటనే వాడాలి వేయాలో చిన్న చిన్న మాటలలో మనసుకి హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పాడు. అగసారానికి పనికిరాని చుట్టాన్ని, ఎన్ని వేడుకున్నా వరమీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కినా పరుగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదలి వేస్తాడు.
3
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుగొల్సి మిడుకుట కంటెన్
వడిగల ఎద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !
భావము:- తన పనికి తగిన వేతనం, తాను అడిగిన జీతము ఇయ్యక కష్టపెట్టే యజమానిని వాడాలి వేసి రెండుమంచి ఎడ్లని కాడి గట్టుకొని వ్యవసాయం చేసి బతుక గల్గిన వాడే నీతిమంతుడు పనికి తగిన ఫలితం లేక పొతే ఎందుకా కొలువు. కాయకష్టం చేసినా కందమాలాలు ఏరుకొని తిన్నా బతుకగలవు కదా !
4
అడియాస కొలవు గొలువకు
గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ !
భావము:- ఏవేవి కూడదో చిన్ని చిన్ని మాటలతో బాలురకు అర్థమయే విధంగా తెలుపుతున్నాడు. నీకిది చేస్తాను, అది చేస్తాను అని అతిగా ఆశ పెట్టి చేయించే పని, దేవాలయాల మీద అధికారము, చెడ్డ వారితో మైత్రి అడవులతో ఒంటరి సంచారము కూడనివి.
5
అధరము కదలియుఁ గదలక
మధురములగు బసలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముజూడ బాపము సుమతీ !
భావము:- ఎవరిని చూస్తేనే పాపము వస్తుందో వివరణ ఇవ్వబడింది అధికారమనే రోగంతో బాధపడుతూ, చెవులు వినిపించక, కనులు కన్పించక, నోరున్నను మూగవానివలె పలుకాడలేక సవమువలె బడియున్న వానిని చూడరాదని భావము.
6
అప్పుగొనిచేయు విభవము
ముప్పన బ్రాయంపుటాలు, మూర్ఖుని తాపమున్
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చురా సుమతీ !
భావము:- ఏవేవి తరువాత కీడు తెస్తాయో వివరింపబడింది. వేడుక చేసుకొనేందుకు చేయు అప్పు, ముసలితనంలో వయసులో వున్నా భార్య, తెలివి లేనివాడు చేయు తపము తప్ప విచారణ చేయకయే శిక్షించు రాజు యొక్క రాజ్యము భరింపలేని విధంగా వుండి రాబోయే కాలమున కీడు తెస్తాయి.
7
అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర సొరకుము సుమతీ !
భావము:- పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేనప్పుడు వున్నా వూరు దాటి పదసంచారం చేయలేని రోజులలో నీతులు ఇవి. కానీ కొన్ని ఈ రోజులోయలో కూడా వర్తిస్తాయి. అవసరం కలికినవేళలో అప్పిచ్చువాడు, నేర్పరి అయన వైద్యుడు, నీటి వసతి, (ఎల్లప్పుడు పారే ఏరు) మంత్రం చెప్పే బ్రాహ్మణుడు, మంచికార్యాలు నిర్వహించే బ్రాహ్మణుడు ఇవన్నీ వున్నా వూరిలో ఉండమని హితవు లేనిచోట ఉంటే వచ్చేకష్టాలకి నీవే కారకుడవు అవుతావు
8
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ !
భావము:- ప్రపంచములో లేని వింతలంటూ అల్లుని యెక్క మంచితనము, హాళ్ళవాడు సాహితవిద్య నేర్వటము, స్త్రీ నీచము చెప్పుట, ఊకను దంచగా వచ్చు బియ్యము, తెల్లని కాకులను పేరుతోన్నారు. కానీ నేటి ప్రపంచములో మొదటి మూడు అబద్ధములని తెలియచేసే మనుజులెందరో కనిపిస్తున్నారు. ఇది కాలానికనుగుణమైన మార్పని సరిపెట్టుకోవచ్చు.
9
ఆకొన్న కూడే యమృతము
తాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్
సోకోర్చువాడే మనుజుడు
తేకువగలవాడే వంశ తిలకుఁడు సుమతీ !
భావము:- మంచి ఆకలి మీద ఉన్నపుడు గడ్డికూడా అమృతము వంటి రుచి కలిగి ఉంటుంది వెనక, ముందు ఆలోచించక అడిగిన వారికి కష్టములలో నున్నవారికి ఇయ్యగలిగినవాడే దాత. కషటనష్టములు కుంగిపోక సదా చిరునవ్వు చెదరణీయని స్థిత ప్రజ్ఞుడే అసలైన మానవుడు. అతడే కులమునకు పేరు తెచ్చు వంశతిలకుఁడు.
10
ఆకలి యుడుగని కడుపును
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్
బ్రాకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ !
భావము:- అసహ్యకరమైనది జుగుప్సయాకరమైనవి ఆకలిబాధ తీర్చని భోజనము, వేశ్యలతో కలయిక, పాతబావిలో పాచి పట్టిన కలుషితమైన నీరు, మేకపాలు మొదలగునవి.
11
ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు , వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ !
భావము:- ఇతరులకు చెప్పగలిగినటువంటిదే విద్య అలా చెప్పగల్గిననే విద్యావంతుడు. యుద్దములో చొచ్చుకు పొగల్గినన్ ధీరుడు. మతిమంతులయిన, గుణవంతులయిన కవులు మెచ్చినదే కవిత్వము. అనవసరమయిన వాదులాటలకు చోటిచ్చుటయే కీడు. అట్టి వాదోపవాదములకు దిగకుండుటయే నేర్పటితనము.
12
ఇమ్ముగజదువని నోరును
అమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !
భావము:- చక్కని తేట తెలుగు అర్థవంతములయిన మాటల్తో చక్కగా చదువులేని నోరు, "అమ్మా" అని పిలువగలేని నోరు, తాంబూల చర్వణము చేయని నోరు కుమ్మరి గుంటతో సమానము.
13
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మిబాము పదినూరేండ్లున్
మడువునగొక్కెర యుండదె
కడునిల బురుషార్ధపరుడు గావాలె సుమతీ !
భావము:- మంచిపనులు చేయుటయందు అనురక్తి కలిగి చతుర్విధ పురుషార్థములను సాధించగల్గిన వ్యక్తి జీవితమే సార్థకం అలా చేయలేని మనిషి ఎన్నేళ్లు ఉడుము, పాము, కొంగలా జీవించినా వ్యర్థుడే.
14
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కరగ బోసిన
నిత్తడి బంగార మగునె ఇలలో సుమతీ !
భావము:- ఎన్ని ప్రయత్నములు చేసినా ఇత్తడి బంగారము కానట్లే జిచులకు ఎన్ని నీతులు నూరి పోసినా ఉత్తముడు కాజాలడు.
15
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మోదవుకడ నున్న వృషభము
జదువని యా కడకు జనకుర సుమతీ !
భావము:- నీరుత్రాగే గుఱ్ఱము, కొవ్వెక్కి మదంతో వుండే ఏనుగు, ఆవు దగ్గరకువస్తున్న ఆంబోతు, చదువు నేర్వని హీనుడు వీరందరూ అపకారము కల్గించేవారు.
16
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !
భావము:- మనకు సహాయము చేసిన వారికీ సహాయపడుట కంటే కిదోనర్చిన వారికి కూడా సహాయపడిన వాడే నేర్పరి.
17
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను జేఱకు కైవడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ !
భావము:- చెడ్డవారితో స్నేహము మొదట తీయగా నున్నను చివరలో హానినే కల్గించును (చెరకు మొదట తీయగా, మధ్యలో కనువుల వద్ద టిపిహరించి చివర చేదుగా వుండునట్లుగా).
18
ఎప్పటి కేయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !
వివేకము కలిగినవాడు సమయోచితములగు మాటలతో ఇతరులను నొప్పింపక తనపని ముగించుకొనును. భావము:-
19
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడనది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ !
భావము:- ఎల్లప్పుడూ తప్పులే పెట్టె యజమానిని సేవించుట పాము పాడగా నీడలో కప్పయున్నట్లే.
20
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
దెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరుగదరా సుమతీ !
భావము:- చెరువు నిండుగా వున్నప్పుడు కప్పలు నిండియున్నట్లే ధనవంతుని కడ బంధువులు మిత్రులు వందమంది చేరుదురు.
21
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ !
భావము:- పిందెలను కోయకూడదు బంధువులను తిట్టకూడదు యుద్దమునించి పారిపోకూడదు గురువుల, పెద్దల మాట అతిక్రమించకూడదు, త్రోచిపుచ్చకూడదు.
22
ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరి యైనగాక నొగి దఱుచైనన్
గకవికలు గాక యుండునె?
సకలంబునుగొట్టువడక సహజము సుమతీ !
భావము:- ఒక ఊరిలో పెద్ద ఏకదే ఉండాలి. పదిమంది ఉంటే అల్లకల్లోలమవుతుంది.
23
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్ల నివాడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌనెగుణమున సుమతీ !
భావము:- గొల్ల ante ఒక కులము కాదు అజ్ఞాని అంటే తనంటే ఇష్టపడని భార్యను ఇష్టములేని స్నేహితుని తనని నమ్మని ప్రభువును విడచుటకు ఒప్పనివాడు.
24
ఓడలు బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ !
భావము:- కలిమి లేములు కావడి కుండలు వంటివి ఒకడదాని వెంటనే మరొకటివుండును కలిమిలో పొంగిపోక లేమితో కుంగిపోని వాడే మనుజుడు.
25
కడు బలవంతుడైనను
బుడమినిఁ బ్రాయంపుటాలి పుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియు
బుడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ!
భావము:- పళ్ళిచేసుకున్న పురుషుడు తన ఆలీని బహుకాలము విడిచిన తానె ఆమెని వేసాని కమ్మన్నట్లు.
26
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్
వొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !
భావము:- నీచగుణములు కాలాగ్ని వారికి ఉన్నత పదవులు వచ్చినను తమ నీచత్వమును వదలలేరు.
27
కప్పకు నొరగాలైనను
సర్పమునకు రోగమైన , సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ !
భావము:- దుఃఖము కలుగుటకు హేతువులు చాలా వున్నాయి ఎవరి దుఃఖము వారికి గొప్ప. కప్పకి కాలు విరిగి పాముకి దీర్ఘవ్యాధి కలిగిన భర్తకు భార్యగాయాలైన, వృద్ధాప్యము ధరిద్రము మిక్కిలి సోకాకారణాలు.
28
కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ !
భావము:- ఎవరు ఉండవలసిన చోట్లలో వారు ఉంటే అందరు క్షేమంగా వుంటారు చోటు మార్చిన మిత్రులే శత్రువులవుతారు. (తామరపులకు సూర్యునికి మిత్రత్వము. కానీ అదే తామరలు నీరులేని చోటవుంటే సూర్యునివేడికి కమలి పోతాయి.)
29
కరణముగరణము నమ్మిన
మరణాంతక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ !
భావము:- కరణము (లేఖకుడు) ఇంకొక కరణమును కూడ నమ్మక, తన గుట్టేవారికిని తెలియనిక బతుకవలెను.
30
కరణముల ననుసరింపక
విరసంబున దిన్నతిండి వికటించుజుమీ
ఇరుసున గందెన బెట్టక
పరమేశ్వరు బండియైన బాఱదు సుమతీ !
భావము:- బండి ఇరుసులో కందెన లేక బండి పరుగిడలేదు. అట్లే కరణము లేకయున్న కష్టములు సంభవించును.
31
కరణము సాదై యున్నను
గరిమదముడిగినను బాము గఱవకయున్నన్
ధర దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కగొనరుగదరా సుమతీ !
భావము:- మెతక స్వభావము అన్నివేళలా పనికిరాదు. సమయసమయములను బట్టి కరకు తనము కుడా అవసరము.
32
కసుగాయఁ గఱచి చూచిన
మసలకఁతగు ఎగరుగాక మధురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలబోడువాడు పశువుర సుమతీ!
భావము:- పశువైతేనే పసి బాలలను అనుభవిస్తాడు. పక్వమునము వచ్చిన పండ్లువుండగా పిందెలను కోయనట్లే వయసు వచ్చిన వారే అనుభవయోగ్యులు.
33
కవిగానివాని వ్రాతయు
నవరసభావములు లేని నాతులవలపున్
దలిచి చని పంది నేయని
వివిధాయుధకౌశలంబు వృథరా సుమతీ !
భావము:- కవి కాని వాడు చేయరచనలు వివిధ భావముల పలికించలేని స్త్రీ ప్రేమ అడవిపందిని కొట్టలేని పురుషుల నైపుణ్యము.
34
కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాడు సుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ !
భావము:- చెడు స్నేహములు కూడదు దానివలన వచ్చే కీర్తి పోదు. అప్పు ఇచ్చుట శత్రుత్వమునకు మూలము. దీని మూలమున స్త్రీ వలపునిల్వదు.
35
కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుఁడు గవయఁ గోరుటయెల్లన్
బ్రేమమున జెఱకు పిప్పికిఁ
జీమలు వెస మూగినట్లు సిద్దము సుమతీ!
భావము:- వేశ్యల కలయిక నిషిద్ధమని ధ్వని. ఒక పురుషుడు భోగించి వడలిని స్త్రీని ఇంకొకడు కోరిన చెరకు పిప్పిని కోరిన చీమ అని భావము.
36
కారణము లేని నగవును
బేరణము లేని లేమ పృధివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణమము లేని పెండ్లి వృధరా సుమతీ !
భావము:- వృధాగా వ్యర్థముగా ఉండేవి - ఏదైనా కారణము లేక నవ్వే స్త్రీ. లోపల ఏమీ పెట్టకుండా వుండే బూరె. వాద్యములు లేని వివాహము మొదలగునవి.
37
కులకాంతతొడ నెప్పుడు
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంటి కన్నీ
రొలికిన సిరి ఇంటనుండ దొల్లదు సుమతీ !
భావము:- కలకంటి (ఉత్తమ జాతిస్త్రి) బాధపడితే ఇంట్లో సుఖము శాంతి వుండవు. కారణము లేకుండా భార్యను బాధింపకూడదు.
38
కూరిమిగల దినములో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !
భావము:- మనకు అవతల మనిషి మీద ప్రేమ యున్నచో ఆటను ఏమి తప్పు చేసినా తప్పువలె కన్పించదు. ప్రేమలేనిచోట తప్పులే కన్పిస్తాయి. సాధ్యమైనంత వరకు కుఱిమినే పాటించమని చెప్పునదే పద్యము.
39
కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడువచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకు బెట్లువచ్చు మహిలో సుమతీ !
భావము:- చెడ్డవారితో చెలిమి మనకు కూడా చేటు తెచునది ఎట్లనగా చిన్ని నల్లి కుట్టినను మంచమును తన్ను విధాన.
40
కొక్కోకమెల్ల జదివిన
చక్కని వాడైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి రొక్కము నీయ్యక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ !
భావము:- వారకాంతల (వేశ్యల) కు అచ్చమైన ప్రేమ ఉండదని వారి ప్రేమ కాసులపైనయేనని తెలుపునాది పద్యము. రతిశాస్త్రము యెంత చదివినా, గొప్ప అందగాడైన రాజాధిరాజైనా ధనమీయనిదే వేశ్య లభించదు.
41
కొరగాని కొడుకు పుట్టిన
గొఱగామియెగాడు తండ్రి గుణములజెఱచున్
జెఱకుతుద వెన్ను పుట్టిన
జేరకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ !
భావము:- చెరకును వెన్ని తినివేసి (తీపి లేకుండా) న విధంగా చెడ్డ పుత్రుడు తండ్రి మంచి గుణములను కూడా తినివేయును.
42
కోమలి విశ్వాశంబున
బాములతోజెలిమియన్య భామల వలపున్
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికులను బొంకుర సుమతీ !
భావము:- ప్రపంచములో అస్త్యములైనవి - స్త్రీ విశ్వాసము, వేపచెట్టు తీపి, పరస్త్రీల ప్రేమ, రాజు యెక్క నమ్మకం, పాముల స్నేహం.
43
గడనగల మగని జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో
గడునుడగు మగనిజూచిన
నడపీనుగు వచ్చేననుచ నగుదురు సుమతీ !
భావము:- సంపాదన లేని పురుషుడిని స్వంత తల్లియు, భార్యయు కూడా తూలనాడుదురని భావము.
44
చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మానుమిదియే మతముర సుమతీ !
భావము:- గతం గురించి చిన్తిపకు, స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు, అంతఃపురకాంతలతో మంతనాలు చేయకు. ఇదే మంచిపని.
45
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుద్రగన్
హేమంబుఁ గూడబెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ !
భావము:- ఎంతయో కష్టపడి, ఎన్నో స్త్రముల్ కోర్చి ధనమును కూడబెట్టిన బలవంతులు దానిని సంగ్రహిస్తారు. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమిస్తాయి. పిసినారి కూడపెట్టిన ధనం భూపాలురు పరమౌతుంది.
46
చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టన ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ !
భావము:- నీ దగ్గర ధనముంటే ఏదో రకంగా చుట్టమంటూ వచ్చి వ్యయము చేస్తారు. జాగరూకత అవసరమని ఈ పద్య భావము.
47
చేతులకు తొడవు దానము
భూతలనాథులకుదొడవు బొంకమి, ధరలో
నీతియె తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ !
భావము:- అసలైన ఆభరణంబులు ఏవనగా
1. చేతులకు - దానము
2. పాలకులకు - నిజము
3. మనిషికి - నీతి
4. స్త్రీకి/పురుషునికి - శీలము
48
తడవోర్వక యోడలోర్వక
కడువేగం బడిచిపడిన గార్యంబగునే
నీతి తోడ వెవ్వారికి
జెడిపోయిన కార్యంబెల్ల జేకురు సుమతీ !
భావము:- తలచిన వెంటనే తాత పెళ్లి కావలనక శ్రమ దయాదుల కోర్చి కష్టపడిననే ఏ పని అయినా జరుగును.
49
తనకోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ !
భావము:- మనిషికి తనలోని గుణములే శత్రువులు, మిత్రులుగాను ఉండును. తన కోపమే తనశత్రువు దయ చుట్టము. తన గుణములను అదుపులో పెట్టుకున్నవాడే మనిషి.
50
తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపు దన సతి రూపున్
తన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ !
భావము:- తన ఊరి తపోనిష్ఠ. తన కొడుకు ఉన్నత చదువు. తన భార్య అందచందాలు తన పెరటి చెట్టు ఔషధగుణము. ఏవేవి మానవుడు గొప్పగా భావించలేడు.
51
తన కలిమి ఇంద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ !
భావము:- తన కలిమి ఇంద్రభోగమనుకొనుట, తన లేమి అత్యంత దయనీయమైనదనుకొనుట. తన చావు జగత్ప్రళయమని. తాను ఇష్టపడినామె జగదేకసుందరని భ్రమ పడుట అందురు.
52
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ !
భావము:- తన వారు లేని చోట, చనువు లేని చోట, కలహించె చోట, అవమానమైనచోట, అనువుగాని చోట అధికులమనుకోకూడదు.
53
తమలము వేయని నోరును
విమతులతో జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమదాముడు లేని రాత్రి హీనము సుమతీ !
భావము:- అల్పమయినవి, నీచమయినవి - తమలము వెంటనీ నోరు, తామరలేని చెరువు, చంద్రుడులేని రాత్రి, విరోధులతో మిత్రత్వము మొదలగునవి.
54
తలనుండు విషము ఫణీకిన్
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలదోక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !
భావము:- పాముకు తలలో విషముంటుంది, తెలుకు తోకలో విషముంటుంది, నీచమయిన జంతువులకు వేరు వేరు చోట్ల విషముంటుంది. అప్పుడు వాణి పట్ల జాగ్రత్తగా నుండవచును. నీచులకు ఒడలంతా విషమే అనగా నీచత్వమే నిండియుండును. వానితో స్నేహము వలన కీడే జరుగును.
55
తలపొడగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలదడివి బాసజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ !
భావము:- నిలువెత్తు ధనము కుమ్మరించినా వ్యభిచారి నిజాము పలుకదు. తలపైచేయి పెట్టి ప్రమాణము చేసినా వేశ్యలను ఎట్టి పరిస్థితులలో నమ్మరాదనుభవము.
56
తలమాసిన, వొలు మాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభు నైనన్
కులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ !
భావము:- మాసిన తల, బట్టలు శరీరముతో ఉంటే ప్రణవల్లభునైనా సొంత భార్యలు కూడ అసహించు కొందురు.
57
తాననుభవింప నర్థము
మానవపతిజేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యోరుజేరునట్లు తిరముగ సుమతీ !
భావము:- మనుజుడనుభవింపని ధనము వృదాయగునది ఎట్లనగా ఈగ కూడబెట్టిన తేనే చందంగా.
58
దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీసుమతీ !
భావము:- చెప్పుడు మాటలు విని ఇతరులకు హాని చేయుట కోరి కల్పవృక్షము నరికినట్లే.
59
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి కెంత గలిగిన
తనభాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ !
భావము:- తన మిత్రులు బంధువులు ఎంతటి వారైనప్పటికీ తనకు వుండు సంపదయే తనకు దక్కును.
60
ధీరులకుజేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మీరి మీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ !
భావము:- బుద్ధిమంతులకు చేసిన మేలు తనకే శుభమది ఎట్లనగా కొబ్బరిచెట్టుకు పోసిన నీరు మంచి కొబ్బరికాయలిచినట్లుగా.
61
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ సరధనములు
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
భావము:- చేయకూడని పనులు ఒంటరిగా మార్గమున నడుచుట, విరోధి ఇంట భుజించుట, ఇతరుల ధనమును దొంగలించుట, ఇతరులను నొప్పించుట.
62
నమ్మకు సుంకరి జూదరి,
నమ్మకు మగసాలివాని, నటువెలయాలిన్
నమ్మకు మంగడివాడిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ !
భావము:- పన్నులు వసూలు చేయువానిని జూదమాడేవారిని, కంసాలిని, వేశ్యను, సరుకులమ్ము వారిని, ఎడమచేతితో పనిచేయువారిని నమ్మకూడదు.
63
నయమున బాలుం ద్రావరు
భయమును విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియో
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ !
భావము:- కొన్నివేళల భయమును చూపించనిచో పనులు జరుగవు. అన్ని వేళల మంచితనము పనికిరాదు.
64
నరపతులు మేర దప్పిన
దిరమొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
గరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మనదు సుమతీ !
భావము:- ప్రాణము పోవునటువంటి కష్టము రాజు ధర్మము యొక్క హద్దు మిరినపుడు, విధవ ఇంట్లో ఎల్లవేళలా అధికారము చెలాయించిన, గ్రామ కారణమూ వైదిక వృత్తి కలిగినను కల్గును .
65
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ !
భావము:- చెవిటివాని ముందు శంఖమూదిన విధముగా తెలివి లేనివారికి మంచి పాటగాని కవిత్వముగాని రుచించదు.
66
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ !
భావము:- హాస్యములాడకూడని చోట్లు, మనుజుల గురించి వివరింపబడెను. సభలందు, తల్లిదండ్రులతో, రాజు దగ్గర, బ్రాహ్మణోత్తముల దగ్గర హాస్యము కూడదు.
67
నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారే నరులకు రత్నము
చీరె శృగారమండ్రు సిద్ధము సుమతీ !
భావము:- అన్ని జీవులకు నీరే ఆధారము. రసవంతమైన పలుకులు పలుకుటకు నోరే ఆధారము. ఆడువారే సర్వజనులకు రత్నము. వస్త్రమే శృంగారమునకు ముఖ్యము.
68
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మనసీయ్యవలదు మహిలో సుమతీ !
భావము:- కూడని పనులు - శత్రుత్వము, పేదరికము వలని దుఃఖము, సభలలో పరుషభాషణ, స్త్రీలకు మనసులో వలపు తెలుపుట.
69
పతికడకు తన్నుగూర్చిన
సతికడకును, వేల్పుకడకు సద్గురు కడకున్,
సుతుకడకును, రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ !
భావము:- నీతిమంతులు యజమాని వద్దకు, తాను ప్రేమించిన భార్య వద్దకు, దేవుని సుఖమునకు, గురువు వద్దకు, కొడుకు దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళరు.
70
పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడలదల్లియు
యనదగు కులకాంత యుండనగురా సుమతీ !
భావము:- కులకాంత లక్షణములు మనువు శ్లోకముననుసరించి చెప్పబడెను. ఉత్తమైల్లల్లు ఇంటిపనుల్లో దాసివలెను, సంభోగసమయములో రంభవలెను, సలహాచెప్పునపుడు మంత్రిలాగా, భోజన సమయములో తల్లిలాగా ఉండాలి.
71
పరనారీ సోదరుడై
పరధనముల కాశపడక, పరులకు హితుడై
పరులు దనుబొగడ నెగడక
బరు లలిగిన నలుగనతడు, పరముడు సుమతీ !
భావము:- ఉత్తమ పురుషుడు, పరస్త్రీలను కోరడు, ఒరుల సంపాదనాశించాడు. స్తుతులకు పొంగిపోడు. నిందలకు కృంగిపోడు.
72
పరసతి కూటమి గోరకు
పరధనముల కాశపడకు, పరునెంచకుమీ
సరిగాని గోష్ఠి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ !
భావము:- పరభార్యల పొందుకూడదు. పరుల ధనమాశించవద్దు. కల్లబొల్లిమాటలు కట్టి పెట్టు. ధనవంతులైన చుట్టముల వద్దకు చెరకు.
73
పరసతుల గోష్ఠినుండైన
పురుషుడు గాంగేయుడైన భువిరని దవడున్
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ !
భావము:- బ్రహ్మచర్యవ్రతము గల భీష్ముడంతటివాడైనను, ఇతర స్త్రీ ప్రసంగములో పాల్గొన్నచో అపవాదు పాలగును. అట్లే మంచిగుణముగల స్త్రీ యైనను పరపురుషునితో స్నేహముచేస్తే భ్రష్టురాలగును.
74
పరుణాత్మ దలచుసతి విడు,
మరుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ,
వెర పెరుగని భటు నేలకు
తరచుగ సతి గవయబోకు, తగదుర సుమతీ !
భావము:- పరపురుషుని పొందగోరు భార్య పనికిరాదు. మారుమాట్లడు కుమారుని దండించవలెను. భయపడని సేవకుని వదిలి వేయవలెను. పలుమారులు భార్యతో పొందు మంచిది గాదు.
75
పరుల కనిష్ఠము సెప్పకు
పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్
బరుఁగలిగిన సతి గవయకు
మెరిగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !
భావము:- పరులకు ఇష్టముకాని దానిని మాట్లాడకు ఇతరుల ఇండ్లకు పనిలేకుండా వేళ్ళకు. ఇతరులు పొందిన స్త్రీని ఆశించకు. పెంకితనముచేయు గుఱ్ఱమును యెక్కకు.
76
పర్వముల సతుల గవయకు
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలోన
గర్వింప నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ !
భావము:- కూడని పనులు - పుణ్యదినముల స్త్రీని కలియుట, రాజు యొక్క దయను నమ్ముట, బాగుపడలేని గ్రామములో నివసించుట.
77
పలుదోమి సేయు విడియము
తలగడిగిననాటి నిద్ర, తరుణుల తోడన్
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ !
భావము:- విలువైనవి - దంతములు తోముకొనిన వెంటనే వేసికొను తాంబూలము, తలంటి తర్వాత నిద్ర, స్త్రీలతో ప్రణయ కలహము తీరిన నతిపొందు.
78
పో టెరుగని పతి కొలువును
గూటంబున కెరుకపడని గోమలి రతియున్
జేటెత్త జేయు జెలిమియు
నీటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ !
భావము:- నదికి ఎదురీదుట యెంత కష్టమో అట్లే పనిపాటల యందు కష్టసుఖము లెరుగని అధికారి సేవ, కీడు కల్గించు మిత్రుత్వము మొదలగునవి.
79
పాలను గలసి జలమును
బాలవిధంబుననే యుండు బరికింపంగా
బాల చవి జెరచుగావున
బాలసుడగువాని పొందు వలదుర సుమతీ !
భావము:- చెడ్డవారితో చెలిమి నీలోని మంచిగుణములను కూడ పోటోట్టును. పాలతో నీరు కలిస్తే పాలరుచి తగ్గిపోవును.
80
పాలసునకైన యాపద
జాలింబడి తీర్చతగదు సర్వజ్ఞునకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ !
భావము:- చెడ్డవారిని చేటు కాలములో రక్షించినను వారు చెడునే చేయుదురు. తేలు నిప్పులో బడినప్పుడు రక్షిస్తే అది మేలనెంచక కుడుతుంది.
81
పిలువని పనులకు బోవుట
గలయని సతి రతియు, రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును
వలవని చేలిమియును జేయవలదురా సుమతీ !
భావము:- చేయకూడని పనులు - ఆహ్వానించని కార్యములకు పోవుట, రాజుచుడని పని, ప్రేమించని స్నేహము, ఇష్టపడని స్త్రీతోభోగించుట.
82
పురికిని బ్రాణము కోమటి,
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
కరికిని ప్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ, సిద్ధము సుమతీ !
భావము:- ఏవేవి వేని వీనికి అవసరమో వివరింపబడింది
పురికి (ఊరికి) - కోమటి
పంటకి - నీరు
ఏనుగుకు - తొండము
సంపదలకు - స్త్రీ
83
పుత్రోత్సాహము తండ్రికి
బుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
భావము:- తండ్రులు కొడుకుని పదిమంది పొగిడినపుడే కొడుకుని కన్నా ఆనందము పొందుతారు.
84
పులిపాలు దెచ్చి ఇచ్చిన
నలవడగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికిగూర్మిలేదు వినరా సుమతీ !
భావము:- వేశ్య స్త్రీలు నిజమయిన ప్రేమను ఎట్టి పరిస్థితులలో చూపించరు.
85
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ !
భావము:- తన పుణ్యఫలం ఎన్ని జన్మలెత్తినా వెంటాడుతుంది. పాపికి భోగాలు కలగవు.
86
పొరుగున వగవాడుండిన
నిరవొందగ వ్రాతకడె యేలికయైనన్
ధరగాపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ !
భావము:- కరణమునకు బ్రతుకు కలుగవలెనన్న - పొరుగున శత్రువు, వ్రాతకాడు పాలకుడు, రైతు చాడీలు చెప్పువాడు కాకూడదు.
87
బంగారు కుదువఁబెట్టకు
సంగరమున బారి పోకు సరసుడవై తే
సంగడి వెచ్చము లాడకు,
వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ !
భావము:- చేయకూడని పనులు - బంగారము తాకట్టు పెట్టుట, యుద్దములో వెన్నిచ్చి పారిపోవుట, అప్పుచేసి సరకులు కొనుట, అవివేకితో మిత్రుత్వము.
88
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేల
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ !
భావము:- దురహంకారం చూపుట నీకే కీడగును. పాము యెంత బలమైనదైనను చలిచీమల కుడితే చస్తుంది.
89
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ !
భావము:- రాజు మంత్రులు ఇద్దరూ తెలివిగల వారు ఐనపుడే రాజ్యము పేరొందును. ఏ ఒక్కరు అవివేకి అయినా ఏనుగుకు తొండములేనట్లే.
90
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము చెడకుండా నిలుచుదఱచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపు గీ లూడినట్లు జరుగదు సుమతీ !
భావము:- సమర్ధుడైన మంత్రి ఉంటేనే రాజ్యము కకావికలు కాకుండా ఉంటుంది.
91
మాటకు బ్రాణము సత్యము
కోటకుబ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికీ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ !
భావము:- మాటకు సత్యమును కోతకు మంచి భటుల సమూహమును, స్త్రీకి శీలమును ఉత్తరమునకు సంతకమును ముఖ్యము.
92
మానధను దాత్మద్రితి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మేయిదాచినట్టు లెరుగుము సుమతీ !
భావము:- ఏనుగు చాలీ చాలని నీళ్లలో తలదాచుకున్నట్లు అభిమానము కలిగినవాడు నించుని సేవించుట.
93
మది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరతిరుగున్
బోది జిలుక పిల్లి పట్టిన
జదువునే యా పంజరమున జగతిని సుమతీ !
భావము:- స్త్రీ మానసిచ్చిన వానితోనే మాటాడుతుంది గాని ఇతరులు యెంత ఆకర్షించాలని ప్రయత్నించినా మాట్లాడారు.
94
మేలెంచని మాలిన్యుని ,
మాలను, నగసాలెవాని, మంగలిహితుగా
నేలిని నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడదు సుమతీ!
దుస్సంగత్యము వలన రాజు నశించిపోతాడు
భావము:- దుస్సాంగత్యము వలన రాజు నశించిపోతాడు.
95
రా పొమ్మని పిలువని యా
భూపాలునిగొల్వ భుక్తిముక్తులు గలవే?
దీపంబులేని యింటను
జేపుణికిళ్లాడినట్లు సిద్ధము సుమతి !
భావము:- దీపములేని ఇంటిలో పట్టు దొరకానట్లే రమ్మని, పొమ్మని రాజును సేవించినా ఫలితము కల్గదు.
96
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజు గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ !
భావము:- కూడని పనులు మాట ఇచ్చి ఇవ్వలేదనుట మేలొనర్చిన వానికి హాని చేయుట, కోపించు యజమానిని సేవించుట, నీచులు సంచరించు ప్రవేశమునకు వెళ్ళుట.
97
లావు గలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివా డెక్కినట్లు మహిలో సుమతీ !
భావము:- నీతి, న్యాయము కలవాడు బలవంతుని కంటే బలవంతుడు.
98
వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనులకడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ !
భావము:- బుద్దిమంతుడు వరదవచ్చి బీడుపడిన పొలమును సాగు చెయ్యడు. పరులకు తన రహస్యమును తెలియనీయడు. ఎంతలేమిలోను బంధువుల దగ్గరకు పోడు పిరికి వానికి ఘనకార్యముల నప్పజెప్పడు.
99
వరిపంటలేని యూరును,
దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ !
భావము:- వల్లకాటితో సమానమైనవి వరిపంటలేని వూరు, అధికారివుండని గ్రామము మొదలగునవి.
100
వినదగు నెవ్వరు చేప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !
భావము:- నిజమైన నీతిమంతుడు అందరూ చెప్పిన సలహాలను విని తనకు వీలైన దానినే ఆచరించును.
=============================================================
101
గుప్తము చేయుము మంత్రము
వ్యాప్తోపాయములనైన వైర్ల గెలుమి
సప్తవ్యసనముల వీడు
మాప్తుల రక్షింపు చాలు నంతియే సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
102
పరహితములేని సంపద
ధర నెవ్వడు గూర్చెనేని దక్కక పోవున్
మురిపెంబున జుంటీగలు
మరి కుడవక గూర్చు తేనె మార్గము సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
103
మరువగవలె నోరు నేరము
మరువగవలె దానమిచ్చి మదిలో నెపుడున్
మరువగవలె ఇష్టదైవము
మరువగవలె దొరల మేలు మదిలో సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
104
వెయ్యారు నదులు జలనిధి
తియ్యక ననిశంబు గలయ తియ్యన గలదా
కుయ్యిడు వానికి జ్ఞానము
వెయ్యి విధంబులను దెలుప వృధారా సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
105
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబు జెందని నోరున్
పాడంగ రాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
106
స్థితి లేక బలిమి చెల్లదు
స్థితి కలిగియు బలిమి లేక చెల్లదు స్థితి, యా
స్థితియును బలిమియు కలిగిన
యతనికిగా కాజ్ఞ చెల్లదవనిని సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
107
వేసరపు జాతి గాని
వీసము దా జేయనట్టి వ్యర్థుడు గానీ
దాసికొడుకైన గానీ
కాసులు గలవాడే రాజు గదరా సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
108
శుభముల నొందని చదువును
నభినయమును రాగరసము నందని పాటలు
అభిలాష లేని కూటమి
సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
109
సరసము విరసము కొరకే
పరి పూర్ణ సుఖంబు లధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధార తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
110
సిరి దా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
111
స్త్రీల యెడ వదు లాడకు
బాలురతో చేలిమి చేసి భాసింపకు మీ
మేలైన గుణము విడువకు
యేలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
112
తమకించిన విషమించుమ్
దమకించిన తల్లియైన దను చెడ చూచుమ్
దమకించిన సుతుదెంచుమ్
దమకించిన ప్రాణహాని తప్పదు సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
113
ఆశించి నప్పుడిచ్చిన
విషము పదివేలబోలు, వేవేళైనన్
విషమని తోచు నీడలో
నా సమయము గడచి చనుట నర్తికి సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
114
ఇచ్చిన దినముల దనకా
లేచిని నెడబాయ రాదలంఘ్యతా నరుతో
నిచ్చిన దినములు తీరిన
నిచ్చిన నరు బాసి లచ్చి యెగుర సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
115
కాదన్న వాడే కరణము
వాదడచిన వాడే పెద్ది వసుధేశు కడన్
లేదన్నవాడే చనవరి
గాధలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
116
ఉరిసెడు ఇంట వసింపకు
మురిసియు పగగొనకు కరణములతో, నింటం
గరిచేడి కుక్కను బెంచకు
చెరిచేడు యగశాలి పొందు సేయకు సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
117
ఎన్నడు కుడవక కట్టక
తన్నేమరి కూర్చు ధనము ధరలో నెపుడుమ్
మన్నిలకు జూదరలకు
కన్నములకు బోవుచుండు గదరా సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
118
కరణము గ్రామాభరణము
కరణము దన్నేలు పతికి కంఠాభరణ
స్ఫూరణ మాటడు వికటించిన
మరిమరి కాపులకు మిగుల మరణము సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
119
కాదని యెవ్వరి తోడన్
వాదించక చూడ వెర్రి వానింబలెనే
భేదాభేదము దెలిపెడు
వేదాంత రహస్యమెల్ల వెదుకర సుమతీ !
భావము:- భావము తెలియదు తెలిసినవారు తెలియజేయగలరు.
Telugu Language Telugu People Telugu Tanamu Telugu Danamu Padyalu Telugu Padyalu Veemana sumati Satakamu Satavadanamu Avadanamu avadani Telugu Desam India andhra Pradesh Telangana Bharatadesam Bharatamaata andhramaata andhra maata PongalDeepavaliDasara Sankranti muggulu Gobbamma Pujari Haridasu Harikatha Burrakatha Tappeta taalam Tappetloi Tallaaloi Chitti chilakamma amma kottindaa nanna Tandri Talli Sivudu parvati vishnuvu Brahma Trilokam paatalam Telugu Families Jr. NTR Taraka Rama Rao Chiranjeevi Rajanikanth Balakrishna Venkatesh Nagarjuna Raviteja Telugu songs Telugu Movies Telugu Samskruti Telugu Sanskriti ammamma nanamma taatayya mamayya attamma tammudu chelli akka attamma attayya atta koduku kumarudu kumarte bavagaru bamardi chellela tammudaa bojanam kura annam pulagura chintaku santosham anna stri janma ajanma velugu telugu velulugu bhakti bakti rakthi sakthi ekkada akkada narinja battai pandu sunnunda margamu bhakthi margamu srujana sruti laya layabaddamga janama bhumi chandra sekhara rao chandra babu naidu KTR NTR TRS YSR TDP Congress YS Jagan Visakhapatnam Vijayawada Guntur Nellore Kurnool Kadapa Rajahmundry Kakinada Tirupati Anantapur Vizianagaram Eluru Ongole Nandyal Machilipatnam Adoni Tenali Proddatur Chittoor Hindupur Bhimavaram Madanapalle Guntakal Srikakulam Dharmavaram Gudivada Narasaraopet Tadipatri Tadepalligudem Amaravati Chilakaluripet West Godavari Kakinada Makar Sankranti Pongal ongal Vasant Panchami Saraswati Thaipusam Kavadi Maha Shivaratri Holi panchami Vasant Navratri Bhajan Rama Navami Gudi Padwa Ugadi Hanuman Jayanti Pournima Bonalu Bathukamma Guru Purnima Sanyasi puja Mahalakshmi Vrata Raksha Bandhan Krishna Janmaashtami Govinda Radhastami Gowri Ganesh Chaturthi Navarathri Vijayadashami Durga Puja Deepavali Rangoli Kartik Poornima Sashti purthi Prathamastami Yatra Deepam Pancha Ganapati Kumbh Mela Godavari Pushkaram Purna Kumbha Mela krishna pushkaram

No comments:

Post a Comment